నేను ఓటు వేసా, మరి మీరు!
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి విడత ఎన్నికలకు పోలింగు ఈ రోజు జరుగుతుంది. మన రాష్ట్రంలో ఉత్తర కోస్తా, తెలంగాణా ప్రాంతాల్లోని 22 పార్లమెంట్, 154 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగు జరుగుతుంది.
మనకి మరోసారి ఓటు వేసే అవకాశం వచ్చింది. అంతా సవ్యంగా ఉంటే మళ్లీ ఐదేళ్లకి కాని మనకి ఓటు వేసే అవకాశం రాదు, అందుకే ఆలసించిన ఆశాభంగం, వెళ్లి ఓటు వేసి రండి. నేనెప్పుడో పొద్దుట ఏడు గంటలకే వెళ్లి ఓటేసొచ్చా. ఇక ఫలితాల కోసం ఓ నెల రోజులపాటు ఎదురు చూడాలి. ఈ లోపు ఎక్కడ ఎంత శాతం ఓట్లు పోలయ్యాయి, ఓటింగు సరళి ఎలా ఉంది--ఇలాంటి విశ్లేషణలతో పత్రికలు, వార్తా చానళ్లు హోరెత్తించేస్తాయి.
ఏడు గంటలకి నేను పోలింగు బూతుకి వెళ్లేటప్పటికే జనం లైనులో నిలబడి ఉన్నారు. పోలింగు ఏడు గంటలకి మొదలు అన్నారు కాని మా బూతులో ఏడున్నరకి కాని మొదలవలేదు. అప్పటికే జనం బాగా వచ్చారు. నాకయితే ప్రతి సారి ఓటు వేసాక ఏదో గొప్ప పని చేసామన్న సంతృప్తి కలుగుతుంది. ముందు పార్లమెంటు అభ్యర్థికి ఓటేసా, లైటు బాగానే వెలిగింది, మోత కూడా బాగానే వచ్చింది. తరువాత అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేసా, ఈ సారి లైటు సరిగ్గా వెలగలేదు కాని మోత అయితే వచ్చింది. నాకేమో అసలు ఓటు పోలయిందా లేదా అని సందేహం. ఏంటో ఈ మెషీనులు.
నాకు మా ఊరిలో ఓటెయ్యాలని ఎంత కోరికో! ప్చ్....ఏం చేస్తాం...నాకు ఓటు హక్కు వచ్చేటప్పటికి చదువు కారణంగా ఊరికి దూరంగా ఉండి ఓటు వెయ్యలేకపోయాను. అసలు మా వాళ్లు నా పేరు ఓటర్ల లిస్టులో వ్రాయించారో లేదో కూడా నాకు తెలియదు. తరువాత ఎలక్షన్ల టైముకి పెళ్లయి మా ఊరికి దూరం అయిపోయా! ఇక ఎప్పటికీ అది తీరని కోరిక అయిపోయింది. పెళ్లయ్యాక మాత్రం ఎప్పుడు ఎన్నికలు జరిగినా నా ఓటు హక్కు వినియోగించుకుంటూనే ఉన్నాను. పోయిన సంవత్సరం ఖైరతాబాదు ఉపఎన్నికలో ఓటు వేయలేకపోయినందుకు ఎంత బాధ పడ్డానో.
మంచి మార్పు కోసం ఓటేద్దాం.